గణిత ప్రతిభా పరీక్ష విజయవంతం
కామారెడ్డి టౌన్/తాడ్వాయి/మాచారెడ్డి/భిక్కనూరు: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య హాజరై ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ గణితం నిత్య జీవితంలో అంతర్భాగమని, ఇందులో నైపుణ్యం సాధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. సంగమేష్, కృతిక, బన్ని, హర్షిత్, రక్షిత, జగదీశ్వర్, అల్తాఫ్, లాస్య, రామ్‌చరణ్ విద్యార్థులు ఈ పరీక్షలో ప్రతిభ చాటారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియం, గురుకుల విద్యార్థుల విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో గణిత ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం మాధవి, గణిత ఫోరమ్ ప్రతినిధులు దేవరాజు, వెంకటి తదితరులు పాల్గొన్నారు. అలాగే తాడ్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితంపై టాలెంటు పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి ఎంఈవో రామస్వామి ప్రశంస పత్రాలు, బహమతులను అందజేశారు. మాచారెడ్డి మండల కేంద్రంలో విద్యార్థినీ, విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో దేవెందర్‌రావ్ మాట్లాడుతూ.. గణితం మనిషి జీవితంలో భాగమ ని అన్నారు.ప్రతిభ చూపిన వారికి ప్రశంస పత్రా లు, బహమతులను అందజేశారు. గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పరీక్షకు భిక్కనూరు మండలంలోని అన్ని పాఠశాలల నుంచి 30 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఏడుగురు విద్యార్థులు ప్రతిభ చూపడంతో ఎంఈవో రాజగంగారెడ్డి ప్రశంసపత్రాలను అందజేశారు.


