యువత రాజకీయాల్లోకి రావాలి
భిక్కనూరు: యువత, మేధావులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామ మొదటి వార్డు సభ్యుడిగా భారీ మెజార్టీతో గెలుపొందిన తొగరి రమేశ్‌ను ఆయన శనివారం సన్మానించారు. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినితీ అక్రమాలపై యువత కదంతోక్కాలన్నారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించడం అంటే అభినందనీయమని, ఇది రాజకీయానికి పునాది వంటిదన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రావణ్‌కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న మండలంలోని గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులను శనివారం హెడ్‌మాస్టర్ ఎల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యాయులు సన్మానించారు. అండర్–14 బాలుర విభాగంలో రాష్టస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న కృష్ణ, వర్షిత్, శ్రీకాంత్, నిఖిల్‌తేజ, అండర్–17 బాలికల విభాగంలో ఎంపికై న వీణ, భవాని, అండర్–17 బాలుర విభాగంలో రోహిత్, సతీష్‌కుమార్‌లను సన్మానించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు.
యువత రాజకీయాల్లోకి రావాలి


