మాజీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి
● డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి
బాన్సువాడ: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వగృహంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇతర పార్టీ నుంచి గెలిచిన సర్పంచులను కలుస్తున్న ఎల్లారెడ్డి మాజీ సర్పంచి ఏనుగు రవీందర్‌రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, బాన్సువాడ నియోజకవర్గంలో తిరగవద్దని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లు చెప్పినా వినకుండా నియోజకవర్గంలో తిరుతున్నారని, ఏనుగు రవీందర్‌రెడ్డి ఆయన సొంతూరులో బీజేపీ సర్పంచ్ గెలిచాడని తెలిపారు. నియోజకవర్గంలో 111 కాంగ్రెస్ సర్పంచులు, 16 మంది కాంగ్రెస్ రెబల్ సర్పంచులు, నలుగురు బీఆర్‌ఎస్ సర్పంచులు, ఆరుగురు బీజేపీ సర్పంచులు గెలిచారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, మోహన్‌నాయక్, ఎజాస్, అసద్ తదితరులున్నారు.


