బీఆర్‌ఎస్‌లో చేరికలు
భిక్కనూరు: పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ సాయగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. నాయకులు ముదాం శ్రీనివాస్, బాలరాజు, ఎర్రోళ్ల మల్లేశం, మహిపాల్, మన్నె రాకే ష్, కోడూరి రవీందర్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: హైదరాబాద్‌లోని హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ సంస్థ కార్యాలయంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి ఎం.భానుమతి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్‌లో కలెక్టర్ సంగ్వాన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శిరీష, పద్మశ్రీ, పావని, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది గ్రామ పంచాయతీలలో కొలువుదీరనున్న నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు మండలంలోని వివిధ గ్రామాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 27 గ్రామపంచాయతీలకు రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ, ఉపాధిహామీ, విద్యాశాఖలకు సంబంధించి 27 మంది అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. అధికారులు ఈ నెల 22న నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారని ఆయన వివరించారు.
దోమకొండ: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శ్రీకాంత్‌లు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీని కలిశారు. ఎన్నికల్లో ముత్యంపేట గ్రామ సర్పంచ్‌గా గెలిచిన ఆశబోయిన అక్షర భర్త శ్రీనివాస్‌తో కలిసి వారు షబ్బీర్ అలీని సన్మానించారు. సోమవారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆయనను కోరినట్లు వారు తెలిపారు.
బీఆర్‌ఎస్‌లో చేరికలు
బీఆర్‌ఎస్‌లో చేరికలు


