ఎరువుల బుకింగ్ యాప్‌పై అవగాహన
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో, కారేగావ్‌లో వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం రైతులకు ఎరువుల బుకింగ్ యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో వినోద్ మాట్లాడుతూ.. ఎరువుల సరఫరాలో రైతులకు ఇబ్బందులు తొలగించడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రైతులు తమ ఇంటి నుంచే యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఏ డీలర్ వద్ద ఎన్ని ఎరువుల బస్తాలు అందుబాటులో ఉన్నాయో ఈ యాప్ ద్వారా క్లుప్తంగా తెలుసుకోవచ్చన్నారు. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఈ యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఏఈవోలు వీణ, లావణ్య, రైతులు పాల్గొన్నారు.
పుల్కల్ సొసైటీలో..
బిచ్కుంద(జుక్కల్): పుల్కల్ సొసైటీలో శుక్రవారం వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ ఎరువుల బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో అమర్ మాట్లాడుతూ.. యూరియా విషయంలో కొరత ఏర్పడకుండా అవసరం ఉన్న రైతులు మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యాప్ ప్రవేశపెట్టిందన్నారు.


