అన్ని పనులు సర్పంచ్‌లే చూసుకునేది
అన్నల చేతిలో హతమైన సర్పంచులు..
సర్పంచ్ సాబ్.. అనే పిలుపులోని మజాను ప్రస్తుత సర్పంచ్‌లు అనుభవిస్తున్నా..
నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న
రోజుల్లో మాత్రం ఆ పదవి అంటేనే
జంకే పరిస్థితి ఉండేది. సర్పంచ్‌గా పోటీ చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి
నాటిది. తమ ఉనికిని పోలీసులకు తెలిపారనో.. లేదా ఇతర కారణాల వల్లనో సర్పంచ్‌లను నక్సల్స్ టార్గెట్ చేసేవారు. ఎంతో మంది వారి చేతుల్లో బలయ్యారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నక్సలైట్ల కార్యకలాపాలు జోరుగా కొనసాగిన కాలంలో సర్పంచ్‌లే వారికి టార్గెట్ అయ్యేవారు. ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లే క్రమంలో అలాగే వివిధ కేసుల విషయంలో పోలీసు స్టేషన్‌కు తిరగాల్సిన సందర్భాల్లో పలువురు సర్పంచ్‌లు నక్సల్స్ చేతిలో హతమయ్యారు. ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి చంపేసిన ఘటనలూ ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీలో పనిచేసినందుకు సర్పంచ్‌లను టార్గెట్ చేసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌లపై దాడి చేసి గాయపర్చడం, హతమార్చడం వంటి సంఘటనలతో అప్పట్లో సర్పంచ్‌గా పోటీ చేయాలంటే చాలా మంది వెనుకడుగు వేసేవారు. కొన్ని గ్రామాల్లో అయితే రెండు మూడు పర్యాయాలు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. పోటీ చేయడానికి సాహసించేవారు కాదు. బతికుంటే బలుసాకుతిని బతకొచ్చు అనుకుని రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనూ నక్సల్స్ ఎన్నికల బహిష్కరణ పిలుపుతో ప్రజలు ఓటు వేయడానికి భయపడేవారు. నక్సల్స్ కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగిన ఉమ్మడి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, రాజంపేట, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, పెద్దకొడప్‌గల్, మహ్మద్‌నగర్, బాన్సువాడ, సిరికొండ, ధర్పల్లి, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వర్ని, డిచ్‌పల్లి తదితర మండలాల్లో పలువురు సర్పంచ్‌లు నక్సల్స్ చేతిలో హతమయ్యారు. పాల్వంచ మండలం భవానీపేటలో సర్పంచ్‌గా పనిచేసిన సూరవ్వను నక్సల్స్ కొట్టారు.. చాలా మంది వారి చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు.
నక్సల్స్‌కు సహకరించారని పోలీసులు
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నక్సల్స్ ప్రాబల్య గ్రామాల్లో సర్పంచ్‌లుగా పనిచేసిన వారు నక్సలైట్లకే కాదు పోలీసులకూ టార్గెట్ అయ్యేవారు. నక్సలైట్లు ఏదై నా పని చెబితే చేయాల్సిందే. దీంతో నక్సల్స్‌కు సహకరించారంటూ పోలీ సులు సర్పంచ్‌లపై కేసులు నమోదు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అజ్ఞాత నక్సలైట్లు గానీ, గ్రామాల్లో ఉండే మిలిటెంట్లు గానీ చెప్పి న పని వినకుంటే నక్సలైట్లకు కోపమొస్తుందని భ యంతో వారు చెప్పిన పని చేసిపెట్టేవారు. ఈ విష యం ఎక్కడో లీక్ అవడంతో పోలీసుల నుంచి పి లుపు వచ్చేది. అటు నక్సలైట్లు, ఇటు పోలీసుల మ ధ్య సర్పంచ్‌లు నలిగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గిన తరువా త సర్పంచ్‌లకు ఇబ్బందులు తగ్గాయనే చెప్పాలి.
నక్సల్స్ చేతిలో బలైన వారెందరో...
ఇన్ఫార్మర్లు అని.. అధికార పార్టీ అని..
ఎందరిపైనో దాడులు
అప్పట్లో పోటీ చేయాలంటే
భయపడే పరిస్థితి
మాచారెడ్డి మండలం భవానీపేట సర్పంచ్‌గా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మంద గంగారెడ్డిని కాల్చి చంపారు.
భిక్కనూరు సర్పంచ్‌గా పనిచేసిన శ్రీరాం నాగభూషణం.
పాల్వంచ మండలం సింగరాయపల్లి సర్పంచ్‌గా పనిచేసిన సామగంజి అంజయ్య.
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల సర్పంచ్ కరిచేవుల బాలరాజు.
లింగంపేట మండలం భవానీపేట సర్పంచ్ ఆకుల అశోక్
బాన్సువాడ మండలం కోనాపూర్ సర్పంచ్ దొడ్లె నారాయణ
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రా మాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి సమయంలో గ్రామాల్లో సర్పంచ్‌లే అన్ని పను లు చూసుకోవాల్సి వచ్చేది. గ్రామంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సర్పంచ్‌లు అధికారులకు సంధానకర్తలుగా వ్యవహరించాల్సి వచ్చేది. నక్సలైట్లకు సహకరిస్తున్నారని పోలీసులు గ్రామంలో ఎవరినైనా పట్టుకువెళ్లారంటే సర్పంచ్‌కు పనిపడినట్టే. పొ ద్దున్నే గ్రామస్తులతో కలిసి ఠాణాకు వెళ్లాలి. అధికారులతో మాట్లాడాలి.
పెద్ద కేసుల్లో ఉంటే.. వారిని అరెస్టు చేసి రి మాండ్‌కు తరలిస్తే కోర్టుకు వెళ్లి న్యాయవాదుల ను మాట్లాడుకుని వారికి బెయిల్ ఇప్పించాల్సిందే. ఇలా ఎన్నో రకాల ఒత్తిడిలో సర్పంచ్‌లు పనిచేసేవారు.


