పర్మిషన్ ప్రకారం కట్టుడే.. లేకుంటే బాదుడే
జరిమానా తప్పదు..
● అనుమతి లేకుండా నిర్మిస్తే
భారీ జరిమానాలు
● ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ద్వారా అనుమతులు
● అమలులోకి కొత్త మున్సిపల్ చట్టం
మున్సిపల్ చట్టం ప్రకారం అనుమతులు, నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చే పట్టాలి. అనుమతులకు వి రుద్ధంగా నిర్మాణం చేపడితే వారికి నోటీసులు జారీ చే స్తాం. గడువులోగా సంజాయిషీ ఇవ్వాలి. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ భవనా లు నిర్మించినా, సెట్‌బ్యాక్ లేని వారికి నోటీసులు ఇ చ్చి చర్యలు తీసుకుంటాం. స్పందించకుంటే కూల్చేస్తాం. – రాజేందర్‌రెడ్డి, కమిషనర్, కామారెడ్డి
కామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా ఇళ్లు నిర్మించుకునే కొందరు పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా అనుమతులు తీసుకోవడం లేదు. మరి కొందరు అనుమతులు ఒకలా, నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుంటే పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించాల్సి వస్తుందని అధికారుల వద్దకు రాకుండా ప్రజాప్రతినిధులు, కిందిస్థాయి సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పి ఇళ్లు నిర్మించుకుంటున్నారు. చివరకు ఇంటి నంబర్ దరఖాస్తు సమయంలో అసలు విషయం బయటపడి ఇళ్ల యజమానులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక నిబంధనల ప్రకారం అనుమతి లేకున్నా.. అక్రమంగా నిర్మించినా భారీగా జరిమానాలు విధించనున్నారు. ఇందులో భాగంగా నూతన చట్టం అమలులోకి తీసుకొచ్చారు. గతంలో టీఎస్‌బీపాస్ ద్వారా ఇంటి అనుమతులకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండేది. ఇక దానిని రద్దు చేసి ‘బిల్డ్ నౌ’ యాప్/పోర్టల్ ద్వారానే ఇక ఇంటి అనుమతులు తీసుకుంటున్నారు.
గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు నిబంధనలు ఒక విధంగా ఉండేవి. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత చట్టం ప్రకారం నిబంధనలు అమలులోకి వచ్చాయి. మున్సిపాలిటీల పరిధిలో ఇంటి నిర్మాణం కోసం జీప్లస్–1 మొదటి అంతస్తు మాత్రమే అనుమతులున్నాయి. జీ ప్లస్–2 నిర్మించాలంటే తప్పనిసరిగా మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పార్కింగ్ స్థలం ఇవ్వాలి. ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ డిక్లరేషన్‌తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రధాన వీధుల వెంట ఉన్నవాటికి, వ్యాపార సముదాయాలకు కచ్చితంగా కమర్షియల్ అనుమతి తీసుకోవాలి. కానీ చాలా మంది నిబంధనలు తెలియక కమర్షియల్ ఉన్న చోట కూడా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటున్నారు. బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నారు.
దండిగా దరఖాస్తులు
కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం భవన నిర్మాణాలకు నిర్దిష్ట సమయంలో అనుమతులు జారీ చేసేలా సులువైన పద్ధతులు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా టీజీ బీపాస్ ద్వారా అనుమతులు ఇవ్వగా.. ఆ తర్వాత బిల్డ్ నౌ యాప్/పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం కామారెడ్డిలో 500 నుంచి 600 వరకు, బాన్సువాడలో 250కి పైగా, ఎల్లారెడ్డిలో 180కి పైగా దరఖాస్తులు వస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీలో కూడా ప్రతి నెల 10 వరకు దరఖాస్తులు వస్తున్నాయి.
రూ. లక్షల్లో ఖర్చు చేసి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంటి నంబర్ కోసం దరఖాస్తు చేసేసమయంలో ఈ విషయం బయట పడుతోంది. అనుమతి పత్రం లేకపోతే ఆస్తిపన్ను మదింపులో జరిమానా విధిస్తారని తె లుసుకోవడం లేదు యజమానులు. మొత్తం అ నుమతి లేకుంటే 100 శాతం, అదనపు నిర్మాణా లు ఉంటే 25శాతం నుంచి 75 శాతం అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ భవనాలకు బ్యాంకుల్లో రుణాలు మంజూరు కావు. ఈ విష యం తెలియక ఇళ్లు నిర్మించుకుంటున్న వారు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
పర్మిషన్ ప్రకారం కట్టుడే.. లేకుంటే బాదుడే


