విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర అత్యంత కీలకం
● ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలి
● శిక్షణా తరగతుల్లో కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్
దోమకొండ: పంచాయతీ ఎన్నికల అధికారులు పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మండ ల కేంద్రంలోని రైతువేదికలో ఎన్నికల అధికా రులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని క లెక్టర్ సోమవారం పరిశీలించి పలు కీలక సూచ నలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో, న్యాయం, పారదర్శకత, శాంతి భద్రతలతో నిర్వర్తించాలని అ న్నారు. ప్రిసైడింగ్ అధికారులు మొత్తం పోలింగ్ ప్రక్రియను సమగ్రంగా పర్యవేక్షించి, ఎటువంటి లోపాలకు తావివ్వకుండా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలన్నారు. పో లింగ్ సమయంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని పోలింగ్ రోజున అనుసరించడం చాలా ముఖ్య మని పేర్కొన్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందే డిస్ట్రిబ్యుషన్ సెంటర్లకు చేరుకుని, తమకు కే టాయించిన కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ ను తీసుకువెళ్ళాలని అన్నారు. పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు వివరాల ప్రకటనలో అప్రమత్తంగా ఉంటూ పక్కాగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే ఓటింగ్ శాతాన్ని, కౌంటింగ్ వివరాలను వెల్లడించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఆర్డీవో వీణ, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏంఈవో విజయ్‌కుమార్, ఎన్నికల శిక్షణ నిర్వాహకులు నర్సింహులు, జ్యోతి, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ..
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా, స క్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. లింగుపల్లి గ్రా మ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్‌ను సందర్శించారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కున వినియోగించుకుంటున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మూడు దశల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఫామ్‌ల పంపిణీ , స్వీకరణ తదితర వివరాలు వెల్లడించారు.
కామారెడ్డి క్రైం : ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్ లకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి హాజరై పలు సూచనలు చేశారు. అబ్జర్వర్‌ల బాధ్యతలు, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డీపీఓ మురళి, ఆయా విభాగాలకు ఎంపిక చేయబడిన మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.
విధులను సమర్థవంతంగా నిర్వహించాలి


