
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
పొగాకు లద్దె పురుగు నివారించడానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తల్లి పొగాకు లద్దె పురుగు ఆకుల అడుగు భాగాన గుంపుగా గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన చి న్న లార్వాలు ఆకు అడుగున గుంపులు గుంపులుగా చేరి ఆకులోని పత్రహరితాన్ని గీసుకుని తినేస్తాయి. లార్వా దశలు పెరిగే కొద్ది విడివిడిగా ఆకులను కొరికి తిని ఈనెలను మాత్రమే మిగుల్చుతాయి. పగటి పూట ఇవి మొక్క మొదళ్ల భాగంలో భూమి లోపల ఉండి రాత్రి పూట నష్టం ఎక్కువ చేస్తాయి. –ప్రజాపతి, ఏవో,సదాశివనగర్