
పత్తిలో పొగాకు లద్దె పురుగు
● కాత దశలో తీవ్రనష్టం
● దిగుబడిపై వాన దెబ్బ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): పత్తి పంటను పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది. రోజురోజుకూ లద్దె పురుగు ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే వర్షాలతో పత్తి పంటకు తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోతుంటే, మరోవై పు లద్దె పురుగు ఆశించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా మారింది. జిల్లా లో వరి తర్వాత రైతులు అధికంగా పండించేది పత్తి పంట.అన్ని మండలాల్లో రైతులు పత్తి సాగుకే ప్రా ధాన్యమిస్తుంటారు. పత్తి పంట సాగుకు ఎకరానికి రూ.25 వేల వరకు ఖర్చు పెట్టారు. అయితే, గతేడా ది వర్షాలు లేక పంటలు దెబ్బతినగా ఈ ఏడాది వి స్తారంగా కురిసిన వర్షాలు పత్తి పంటను నాశనం చే స్తున్నాయి. భూముల్లో తేమ శాతం అధికమై మొక్క ల్లో ఎదుగుదల లోపించింది. ఆశించిన స్థాయిలో పూత రాక, కాయలు సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. భారీ వర్షాల కారణంగా ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు.
రసాయణ నియంత్రణ చర్యలు:
విషపు ఎర: మూడోదశ దాటిన పొగాకు లద్దెపురుగు అదుపు చేయటానికి విషపు ఎరను వాడాలి. ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లంతోపాటు 300 గ్రాములు థయోడికార్బ్ మందును సరిపడా నీటితో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం వేళలో పొలమంతా చల్లుకోవాలి.
మందు పిచికారీ: పొగాకు లద్దె పురుగు నివారణకు నొవాల్యూరాన్ 1 ఎంఎల్ లేదా లుఫెన్యురాన్, 1.25 ఎంఎల్, లేదా థయోడికార్బ్ 1.5, క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
సహజ నియంత్రణ చర్యలు
వేప గింజల కషాయం 5 శాతం లేదా వేప నూనె 1500 పీపీఎం,5 ఎంఎల్ ఒక లీటరు నీటికి కలిపి పి చికారీ చేయాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏ ర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరా నికి ఎర పంటగా 20 ఆముదం మొక్కలు నాటాలి.