
వరద బాధిత విద్యార్థులకు ఏబీవీపీ చేయూత
కామారెడ్డి రూరల్: అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్(ఏబీవీపీ) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ నోట్ బుక్ పోస్టర్‌ను బుధవారం ఎస్పీ రాజేష్ చంద్ర ఆవిష్కరించారు. కొద్ది రోజుల క్రితం కామారెడ్డిలో వరదల కారణంగా విద్యార్థుల పుస్తకాలు వాటికి సంబంధించిన స్టేషనరీ వస్తువులు కొట్టుకుపోయాయి. వారికి చేయూతను అందించడానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ నోట్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలలు ఒక పెన్ను, ఒక నోట్ బుక్, పెన్సిల్, స్టేషనరీ వరద బాధితుల విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ఏబీవీపీ నేతలు పేర్కొన్నారు. ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు ముందుకొచ్చి ఈ పని చేస్తున్నాయని తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలను ఎస్పీ ప్రశంసించి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఎన్నో చేయాలని వారు సూచించారు. ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్ రెడ్డి, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి.శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్, కామారెడ్డి నగర కార్యదర్శి సంతోష్, నాయకులు సంజయ్, చరణ్, రాజు నవీన్, తదితరులు పాల్గొన్నారు.