
మరోసారి ఉగ్ర కలకలం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మరోసారి ఉగ్ర మూలాలు కలకలం సృష్టించగా ప్రజలు ఉలి క్కిపడుతున్నారు. తాజాగా బుధవారం బోధన్ పట్టణానికి చెందిన హాజీయమన్‌ను ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేసి విచారణ నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్లారు. ఐసిస్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులను జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్‌ఐఏ అరెస్టు చేసి విచారణ చేసిన సమయంలో బోధన్‌కు చెందిన హాజీయమన్ పేరు బయటకు వచ్చింది. హాజీయమన్ గత కొంతకాలంగా అంతర్జాతీయ ఫోన్‌కాల్స్ ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని ఎన్‌ఐఏ గుర్తించింది. ఇతని ఇంట్లో ఎయిర్‌గన్‌ను ఎన్‌ఐఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోధన్ కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం హాజీయమన్‌ను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఐసిస్‌తో సైతం లింకులు ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు.
● బోధన్ పట్టణంలో నకిలీ చిరునామాలతో 2018 లో బంగ్లాదేశీయులకు అక్రమ పద్ధతిలో 74 పాస్‌పోర్టులు జారీ చేశారు. ఈ విషయమై అప్పటి స్పెష ల్ బ్రాంచ్ ఏఎస్‌ఐలు మల్లేష్, అనిల్‌లపై ప్రభు త్వం చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు తరువాత బోధన్‌కు వచ్చిన వ్యక్తులకు అక్ర మంగా పాస్‌పోర్టులు జారీ చేసే విషయంలో ఈ ఇద్దరు ఏఎస్‌ఐలు కీలక పాత్ర పోషించడం గమనార్హం. బోధన్‌లోని ఒకే ఇంటి నంబర్ మీద 24 పాస్ పోర్టులు ఇవ్వడం అప్పట్లో సంచలనం కలిగించింది. అలాగే ఇతర అద్దె ఇంటి నంబర్లపై సైతం ధ్రువీకరణలు సృష్టించి పాస్‌పోర్టులు జారీ చేయించారు. తరువాత కాలంలో బోధన్‌లో రోహింగ్యాలకు ఆధార్ కార్డులు సైతం జారీ చేయడం గమనార్హం.
శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్ట్‌తో..
నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో 2022 జూలై 4న పీఎఫ్‌ఐ సభ్యుడు, శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్ట్‌తో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్ ఖాదర్ డైరీ, వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ ఖాదర్ అరెస్ట్ తర్వాత నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో ముగ్గురు పీఎఫ్‌ఐ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సమాచారంతో పోలీసులు పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ షేక్ షాదుల్లాను, నగరానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకుని విచారించారు. శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ వద్ద దొరికిన డైరీలోని వివరాలతో విచారణ చేపట్టారు. జిల్లాలో 200 మందికి పైగా శిక్షణ తీసుకోగా, ఇందులో 23 మంది కీలక సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో కడప బేస్ క్యాంపుగా ఏర్పాటు చేసుకుని పీఎఫ్‌ఐ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. విచారణలో పీఎఫ్‌ఐ ఒక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఎన్‌ఐఏకు లేఖ రాశారు. ఎన్‌ఐఏకు చెందిన ఉన్నత స్థాయి అధికారి జిల్లా పోలీసులతో సమావేశమయ్యారు. కేసులో తీవత్రను గుర్తించిన ఎన్‌ఐఏ 2022 ఆగష్టు 26న పీఎఫ్‌ఐ కేసును తీసుకుంది. ఎన్‌ఐఏ అధికారులు నలుగురిని విచారించిన తరువాత సెప్టెంబర్ 18న నిజామాబాద్‌తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రిక్ వస్తువులు, సెల్‌ఫోన్లులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు లభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు హాజరు పర్చారు. వారిచ్చిన సమాచారంతో పాటు ఎన్‌ఐఏ సేకరించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. 170 మందిని అరెస్ట్ చేయడంతో పాటు విదేశాల నుంచి రూ.120 కోట్లు సేకరించినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. సిమి నుంచి పీఎఫ్‌ఐగా మారిన ఈ సంస్థకు ఐసిస్, లష్కరేతోయిబా సంస్థలతోనూ సంబంధాలు ఉన్నట్లు తేలింది.
నిషేధిత సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) నుంచి పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)గా రూపాంతరం చెందిన ఉగ్ర సంస్థ శిక్షణ కేంద్రాన్ని 2022లో నిజామాబాద్‌లో కనుగొన్నారు. ఈ శిక్షణ కేంద్రంలో వివిధ రకాలుగా హత్యలు ఎలా చేయడం, మతకలహాలు సృష్టించే విషయాలపై శిక్ష ణ ఇచ్చారు. దక్షిణాదిలో కీలకమైన బేస్‌క్యాంప్‌గా నిజామాబాద్ ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 2022 జూలై 4న నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐ శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్టుతో దేశవ్యాప్తంగా డొంక కదిలింది. తరువాత జూలై 6న మరో ముగ్గురిని నిజామాబాద్‌లో అరెస్టు చేశారు. సెప్టెంబర్ 18న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం 23 మందిపై జిల్లాలో కేసులు నమోదు చేశారు. ఆర్మూర్‌కు చెందిన నవీద్ అనే వ్యక్తిని సైతం ఎన్‌ఐఏ విచారించింది. అదేక్రమంలో దేశవ్యాప్తంగా 106 చోట్ల వివిధ రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్‌ఐఏ మొత్తం 170 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలన్నింటిపైన కేంద్రం యూఏపీఏ చట్టం కింద నిషేధం విధించింది.
బోధన్‌లో హాజీయమన్‌ను అదుపులోకి
తీసుకున్న ఢిల్లీ ఎన్‌ఐఏ బృందం
ఉలిక్కిపడుతున్న జిల్లా ప్రజానీకం
గతంలో బంగ్లాదేశీయులకు అక్రమంగా
పాస్‌పోర్టులు జారీ చేసిన వైనం
2022లో జిల్లా కేంద్రంలో ఉగ్ర సంస్థ శిక్షణ శిబిరాన్ని కనుగొన్న ఎన్‌ఐఏ, పోలీసులు
అనంతరం పీఎఫ్‌ఐపై నిషేధం
విధించిన కేంద్ర ప్రభుత్వం

మరోసారి ఉగ్ర కలకలం