
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు
కామారెడ్డి క్రైం: కామారెడ్డిలో ఈనెల 15 న నిర్వహించే సీఎం సభకు సంబంధించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలో సీఎం సభ నిర్వహించే ప్రాంతం, హెలీప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాల్లో సూచిక బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, సీఐలు నరహరి, రామన్ తదితరులు పాల్గొన్నారు.