
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● మహిళా శక్తి సంబురాల్లో
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మహిళా శక్తి సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ రుణం రూ. 20.56 కోట్ల చెక్కును, కామారెడ్డి నియోజక వర్గంలోని మహిళా సంఘాలకు రూ. 5.28 కోట్ల వడ్డీ రాయితీ చెక్కును, ప్రమాద బీమా కింద ముగ్గురు సభ్యుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొపున చెక్కులను అందించారు. మహిళా శక్తి గొప్పదని, మహిళలు అభివృద్ధి చెందినపుడే సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించాలని పేర్కొన్నారు.
వనమహోత్సవంలో మంత్రి..
జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ (బాలికల) గురుకుల పాఠశాలలో వనమహోత్సవం నిర్వహించారు. మంత్రి సీతక్క పాల్గొని మొక్కలు నాటారు. మహిళా క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో మాట్లాడారు. ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని సూచించారు.మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అటవీ అధికారి నిఖిత, బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, సెర్ప్ సీఈవో నగేశ్, డీఆర్‌డీవో సురేందర్ తదితరులున్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం