
ఉత్తీర్ణత శాతంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మద్నూర్(జుక్కల్): ఇంటర్‌లో విద్యార్థుఽల ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని కళాశాల లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తీర్ణత శాతం పెంచాలని ఇంటర్ బోర్డు ప్రత్యేకాధికారి ఒడ్డెన్న ఆదేశించారు. మండల కేంద్రంలోని రాంసుఖ్ బాల్‌ముకుంద్ ఇనాని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతంపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ పాండురంగ్, లెక్చరర్లు గంగాధర్, తదితరులున్నారు.