
రేషన్‌కార్డుల పంపిణీ నూతన శకానికి నాంది
ఎల్లారెడ్డి: రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నూతన శకానికి నాంది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో నూతనంగా ఇప్పటి వరకు 5,647 మందికి రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులను ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. 10 సంవత్సరాల తరువాత బీద వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. బీదవారికి రేషన్ కార్డులను అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనంతరం నూతనంగా మంజూరైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి తహసీల్దార్లు ప్రేమ్‌కుమార్, సురేష్, ఎల్లారెడ్డి, గాంధారి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు రజిత, పరమేష్, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు సాయిబాబా, నారాగౌడ్, శ్రీధర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు కుడుముల సత్యనారాయణ, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులున్నారు.
మహిళలను కోటీశ్వరులను
చేయడమే ప్రభుత్వ లక్ష్యం
లింగంపేట(ఎల్లారెడ్డి): తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. శుక్రవారం లింగంపేట జీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన నియోజక వర్గస్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులను బ్యాంకు లింకేజి ద్వారా రుణాలు అందజేసి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు రూ. 20 కోట్ల చెక్కును అందజేశారు. అలాగే లోన్ బీమా, ప్రమాద బీమాకు చెందిన రూ. కోటి చెక్కును సభ్యులకు అందజేశారు. సెర్ఫ్ డైరెక్టర్ శ్రీగోపాలరావు, డీఆర్‌డీవో సురేందర్, ఏపీడీ విజయలక్ష్మి, ఎల్లారెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, లింగంపేట సొసైటీ చైర్మన్ దేవెందర్‌రెడ్డి, డీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు