
ఆపదలో ఆపన్న హస్తం సీఎంఆర్‌ఎఫ్
బాన్సువాడ రూరల్: ఆపదలో పేదల పాలిట ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని తన నివాసంలో నియోజకవర్గంలోని 66 మందికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. రోగాలు, ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల్లో వెచ్చించిన బిల్లులను ప్రభుత్వానికి సమర్పిస్తే సీఎం రిలీఫ్ పేరిట ఆర్థికసాయం అందజేస్తుందన్నారు.
క్రీడా సామగ్రి అందజేత
మాచారెడ్డి: జిల్లా కేంద్రానికి చెందిన నీల వెంకటేష్ మండలంలోని లచ్చాపేట ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం రూ.10 వేల విలువైన క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఉపాధ్యాయులు సన్మానించారు. పాఠశాల హెచ్‌ఎం లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు లింగారెడ్డి, అఖిల్ హుస్సేన్, శ్రీనివాస్ పారినాయుడు, రాజేశ్వరి, రమేష్ ఖురేషియా మోయిన్, నరసింహులు పాల్గొన్నారు.
ఆరోగ్య ఉప కేంద్రాల తనిఖీ
భిక్కనూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు మండలంలోని బస్వాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం ఎన్సీడీ జిల్లా కో–ఆర్డినేటర్ ఊహశ్రీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఉప కేంద్రంలో ఎన్సీడీ స్క్రీనింగ్ వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ఎప్పటికప్పుడు మందులను పంపిణీ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్య విస్తర్ణ అధికారి వెంకటరమణ, ఏఎన్‌ఎం యాదమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్న హస్తం సీఎంఆర్‌ఎఫ్

ఆపదలో ఆపన్న హస్తం సీఎంఆర్‌ఎఫ్