
ఆన్‌లైన్ సమస్యను పరిష్కరించాలని వినతి
కామారెడ్డి టౌన్: భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించి సంక్షేమ మండలి జారీ చేయనున్న లేబర్ కార్డులకు సంబంధించి మీ–సేవ కేంద్రాలలో ఆన్‌లైన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పు సాయికుమార్ మాట్లాడుతూ.. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
వినతిపత్రం అందజేస్తున్న కార్మికులు