
కలెక్టర్‌తో భేటీ
కామారెడ్డి టౌన్: ఇటీవల ఏజీపీగా నూతనంగా నియమితులైన కె. శ్యామ్‌గోపాల్‌రావు సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేశారు. కేసుల విషయంలో సానుకూలంగా స్పందించి, కోర్టు వ్యవహారాలు చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్‌ను కలిసిన
ఎల్లారెడ్డి ఆర్డీవో
కామారెడ్డి క్రైం: ఎల్లారెడ్డి ఆర్డీవోగా నియమితులైన పార్థసింహారెడ్డి సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. భూ సమస్యల పరిష్కారం, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ముట్టడి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సోమవారం కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ హాజరై ధర్నానుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అనుమతించడంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
లీగల్ సర్వీసెస్
కరపత్రాల ఆవిష్కరణ
మద్నూర్(జుక్కల్): స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహణ కరపత్రాలను సోమవారం ఎస్సె విజయ్‌కొండ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలు, సీనియర్ సిటిజన్ తగాదాలు, చిన్న సమస్యలను పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగకుండా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. మద్నూర్ జీపీ ఆవరణలో గల కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌లో వలంటీర్లు ఉడుతావార్ సురేష్, మోరే అశోక్‌లను సంప్రదించాలని సూచించారు. అలాగే న్యాయ సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి సలహాలు కోరవచ్చన్నారు.

కలెక్టర్‌తో భేటీ

కలెక్టర్‌తో భేటీ

కలెక్టర్‌తో భేటీ