
చేపల కౌలు చెల్లింపులో జిల్లా టాప్
నిజాంసాగర్:మత్స్యకార్మికులకు జీవనోపాధి కల్పి స్తున్న చేపల చెరువులు, రిజర్వాయర్లు, ప్రధాన జలాశయాల్లో చేపల పెంపకానికి సంబంఽధించిన కౌలు చెల్లింపులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రఽథ మ స్థానంలో నిలిచింది. 2024–25 సంవత్సరంలో 765 చెరువులకుగాను రూ. 13.86 లక్షల కౌలు చెల్లించడం ద్వారా జిల్లా టాప్‌లో ఉంది.
జిల్లాలో 765 చెరువుల్లో చేపల పెంపకం ద్వారా మత్స్యకార్మికులు జీవనోపాఽధి పొందుతున్నారు. ప్రభుత్వం చేప పిల్లలను వందశాతం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. అయితే చెరువుల్లో చేప పిల్లల పెంపకం, చేపల వేటకు సంబంధించి మత్స్యకారులు సర్కారుకు కౌలును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించి 765 చెరువులకుగాను రూ. 13.86 లక్షలు చెల్లించారు.
835 మందికి కొత్త లైసెన్స్‌లు..
జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్‌తో పాటు ఆయా చెరువుల పరిధిలో 1,600 మంది మత్స్యకారులు కొత్తగా లైసెన్స్‌లకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 835 మందికి లైసెన్స్‌లు జారీ చేశారు. మత్స్యకార్మికులకు కొత్తగా లైసెన్స్‌లు ఇవ్వడంతో ప్రభుత్వానికి రూ. 1.71 లక్షల ఆదాయం సమకూరింది.
13,006 మందికి ఉపాధి..
జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టు, 765 చెరువుల పరిధిలో 13,006 మంది మత్స్య కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. చెరువు లు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం ద్వారా చేపల వేటతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
765 చెరువులకుగాను
రూ. 13.86 లక్షలు..
రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన
కామారెడ్డి
మత్స్యకార్మికుల సహకారంతోనే సాధ్యం
జిల్లాలోని మత్స్యకార్మిక సంఘాలు, మత్స్యకార్మికు ల సహకారంతో ఈ ఏడాది వందశాతం కౌలు వసూలయ్యింది. ప్రభుత్వానికి రూ. 13.86 లక్షల కౌలు చెల్లించడం ద్వారా జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. కౌలాస్ ప్రాజెక్టులో చేపల వేటకు సంబంధించి టెండర్ ప్రక్రియ చేపట్టడంతో రూ. 4.45 లక్షలు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చింది. – శ్రీపతి, ఎఫ్‌డీవో, కామారెడ్డి

చేపల కౌలు చెల్లింపులో జిల్లా టాప్