
కదిలొచ్చిన అమ్మ
నిజామాబాద్ రూరల్: గ్రామ దేవతలు కదిలొచ్చిన వేళ ఇందూరు నగరం పులకించింది. తమ తమ ప్రాంతాలను సల్లంగా కాపాడాలని కోరుతూ నగ ర వాసులు అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్టించారు. స ర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను న గరంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఖి ల్లా రామాలయం వద్దనున్న శారదాంబ గద్దె నుంచి అమ్మవార్లు బయలెల్లగా.. ముందు వరుసలో ‘సరి’ గుల్ల ముందుకుసాగింది. కదిలొస్తున్న అమ్మవార్ల ను చూస్తూ తన్మయత్వంతో నగరవాసులు ‘పులోరి యా’ అంటూ నినాదాలను హోరెత్తించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, తొట్లెల ఊరే గింపు, శివసత్తుల పూనకాలతో నగరవీధులు హోరెత్తాయి. శారదాంబ గద్దె నుంచి రాట్నం, చక్రం, పెద్దమ్మ, పౌడాలమ్మ, మహాలక్ష్మమ్మ, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, కొండల రాయుడు, భోగస్వామి, సమ్మక్క, సారక్కలు తరలిరాగా.. పెద్దబజార్, ఆర్యసమాజ్, జెండాగల్లి, వినాయక్‌నగర్, మహాలక్ష్మినగర్, దుబ్బ ప్రాంతాల వైపు శోభాయాత్ర కొనసాగింది. ఊరపండుగలో ప్ర త్యేకమైన సరి(పదార్థం)ని భక్తులు ఇళ్లపై చల్లుకున్నారు. భక్తులు దారి పొడవునా యాటలను బలి స్తూ మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షా లు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామదేవతలను పూజించారు. ఊరపండుగను పు రస్కరించుకొని ఇందూరు నగరమంతా జనసంద్రంగా మారింది. శారదాంబ గద్దె వద్ద అర్బన్ ఎ మ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బ ల్మూరి వెంకట్, సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బట్టు రాజేశ్వర్, కో కన్వీనర్ ఆదె ప్రవీణ్, నుడా చైర్మన్ కేశ వేణు, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, ఆయా పార్టీ ల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రా మదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.
ఇందూరులో ఘనంగా ఊరపండుగ
హోరెత్తిన ‘పులోరియా’ నినాదాలు