
జన జీవనానికి పాట ప్రాణం లాంటిది
కామారెడ్డి అర్బన్: తెలంగాణ జన జీవనానికి పాట ప్రాణంలాంటిదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని కర్షక్ బీఎడ్ కళాశాలలో యువ కళాకారులను ప్రోత్సహించడానికి ప్రజాయుద్దనౌక గద్దర్ యాది లో ‘పాటకు సలామ్’ పాటల వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పాటకు సలామ్‌తో యువ గాయకులు వెలుగులోకి వస్తారన్నారు. వర్క్‌షాప్ కళాకారుల అభివృద్ధికి దోహదం చేస్తుందని తెరవే జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ అన్నారు. సంగీత దర్శకుడు అష్ట గంగాధర్, గజల్ కవి సురారం శంకర్, అల్లి మోహన్‌రాజ్, ఎంఏ రషీద్, శ్యాంకుమార్, మౌర్య, జీవన్‌కుమార్, నాగభూషణం, కాశ నర్సయ్య, కమలకాంత్, రెడ్డి రాజయ్య, కాసర్ల రా మచంద్రం, గంగాప్రసాద్, సంధ్య, సావిత్రి, రస్మి త, అక్షిత, సుజిత పాల్గొన్నారు. పాల్గొన యువ గా యనీగాయకులకు ధ్రువపత్రాలతో పాటు జ్ఞాపిక లు, బహుమతులు అందజేశారు.