
పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి
గాంధారి(ఎల్లారెడ్డి): పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, పోలీస్టేషన్‌కు వచ్చిన వారితో స్నేహపూర్వంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. గాంధారి పోలీస్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా మొదట ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది నుంచి పోలీసు వందనం స్వీకరించారు. అనంతరం రికార్డులను పరిశీలించి ఎస్సైకి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
గాంధారి మండల పరిధిలోని మొండిసడక్ వద్ద ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సీసీ కెమెరాలను ప్రారంభించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మొండిసడక్ వ్యాపారుల స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారన్నారు.