
వనంలో కొలువైన అమ్మలు
– 9లో u
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో అటవీ ప్రాంతాలు, గుట్టలు, చెరువు గట్ల వద్ద గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి. దోమకొండ మండలంలోని అంబారీపేట శివారులో గుట్టపై వెలిసిన గుట్ట మైసమ్మ, నస్రుల్లాబాద్ మండలంలోని మైలారంలో కొచ్చెరు మైసమ్మ, లింగంపేట మండలంలోని కేశాపూర్–కోమట్‌పల్లిలోని అల్లూరమ్మ, లింగంపేట మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ, జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటపై వెలిసిన ఎల్లమ్మ, కామారెడ్డి పట్టణానికి సమీపంలోని ఉగ్రవాయి మైసమ్మతో పాటు ఎన్నో ఆలయాలు ప్రకృతి ఒడిలో భక్తుల నుంచి పూజలందుకుంటున్నాయి. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన ఈ దేవతామూర్తులను దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకంతో తమ కష్టాలు తీరాలని ముడుపులు కట్టడం, మొక్కుకోవడం.. అవి తీరిన తర్వాత యాటలు కోసి దేవుళ్లకు పండుగలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో ఉన్న ఆలయాల వద్ద ఆదివారాల్లో పెద్ద ఎత్తున పండుగలు చేస్తుంటారు. మిగతా వారాల్లోనూ సందడి కనబడుతుంది.
ఎల్లవేళలా వెన్నంటి వుండే తల్లి ఎల్లమ్మ. ఆపదలనుంచి కాపాడే అమ్మ పోచమ్మ. దుష్టులను దునుమాడి, శిష్టులను కాపాడే శక్తి స్వరూపిణి మైసమ్మ. గ్రామ దేవతలుగా పిలవబడుతున్న ఈ అమ్మలు.. భక్తుల కొంగుబంగారంగానూ పూజలందుకుంటున్నారు. జిల్లాలో పలు గ్రామదేవతల ఆలయాలు ప్రకృతి ఒడిలో ఉన్నాయి. ఆ ఆలయాలలో ఏటా ఆషాఢంలో ఘనంగా జాతరలు జరుగుతాయి. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఏడాదంతా పండుగలు నిర్వహిస్తారు. వనంలో కొలువుదీరిన గ్రామదేవతల ఆలయాలపై సండే స్పెషల్..
న్యూస్‌రీల్

వనంలో కొలువైన అమ్మలు