
చెరువు గట్టున కొచ్చెరు మైసమ్మ..
నస్రుల్లాబాద్ మండలం మైలారంలోని కొచ్చెరు మైసమ్మకు ఎంతో చరిత్ర ఉంది. రెండు వందల ఏళ్ల కిందట భారీ మర్రి వృక్షం కింద మైసమ్మ వెలిసిందని చెబుతారు. చెరువు గట్టున వెలసిన అమ్మవారిని కొచ్చెరు మైసమ్మగా కొలుస్తారు. మంగళ, శుక్ర, ఆదివారాల్లో బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి వారం దాదాపు వందకుపైగా మేకలు, గొర్రెలు కోస్తారు. ఆషాఢ మాసం చివరి శుక్రవారం అమ్మవారికి బోనాలు తీస్తారు. చాలా కుటుంబాలు ఇంటి దేవతగా కొచ్చెరు మైసమ్మను కొలుస్తారు. చెరువు గట్టున ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఆలయం వద్దకు బంధువులు, స్నేహితులతో తరలివచ్చి వంటలు వండుకుని విందు భోజనాలు ఆరగిస్తారు.

చెరువు గట్టున కొచ్చెరు మైసమ్మ..