
కౌలాస్ కోటలో ఎల్లమ్మ..
జుక్కల్ మండలంలోని కౌలాస్ కోట లో గుట్టపై భాగా న ఉన్న ఎల్లమ్మ ఆలయానికి వంద ల ఏళ్ల చరిత్ర ఉంది. కౌలాస్ కోట ద్వారా పాలన సా గిన కాలం నుంచి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహి స్తున్నారు. ఇప్పటికీ రాజవంశీయులు ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు. ప్రతి శుక్ర, మంగళ, ఆదివారాల్లో భక్తులు వచ్చి పండుగలు చేసుకుంటారు. గుట్ట మీద అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి చుట్టుపక్కల మండలాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చాలా కుటుంబాలకు ఈ ఎల్లమ్మ ఇంటి దేవతగా ఉంది.