
మారనున్న వీధి రాత
మున్సిపాలిటీ వీధి వ్యాపారులు సంఘాలు
కామారెడ్డి 5,496 69
బాన్సువాడ 1,402 19
ఎల్లారెడ్డి 1,012 13
మొత్తం 7,910 101
బాన్సువాడ : వీధి వ్యాపారులను పొదుపు వైపు మ ళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో కామన్ ఇంట్రస్ట్ గ్రూప్(సీఐజీ)లను ఏర్పా టు చేయడానికి మెప్మా సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీ ల్లో 101 వరకు సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతి గ్రూప్‌లో 5 నుంచి 10 మంది స భ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మొదటి విడతగా మొత్తం 7,910 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరితో ఏర్పాటు చేసే గ్రూపుల్లో ఎంపిక చేసిన సంఘాల్లోని సభ్యులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. వారు బ్యాంకు ఖా తాలు తెరిచిన వెంటనే సంఘాల పొదుపు ప్రక్రియ ను పరిశీలించి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించనున్నారు. ఆరు నెల తర్వాత సంఘాలకు మొదటి విడతగా రూ.లక్ష, తర్వాత రూ.3 లక్షల నుంచి రూ.5 ల క్షలు, సకాలంలో చెల్లిస్తే రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే వీధి వ్యాపారులు ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవడాని కి వీలుగా పీఎంశ్రీ నిధి పథకం కింద దుకాణాలు ని ర్మించనున్నారు. మున్సిపాలిటీల పరిధిలో రేకుల షెడ్లు నిర్మించి వీధి వ్యాపారులకు కేటాయించనున్నారు.
ఆరునెలల తర్వాత రుణాలిప్పిస్తాం
జిల్లాలో మూడు మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో ఏర్పాటయ్యే సంఘాలకు ఆరు నెలల తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం. దీంతో వారికి వెసులుబాటు కలుగుతుంది. కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది.
–శ్రీధర్‌రెడ్డి, మెప్మా పీడీ, కామారెడ్డి
సభ్యులకు బీమా సదుపాయం..
పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు రూ. 2లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తూ సభ్యులు మృతి చెందితే వారికి బీమా వర్తిస్తుంది. ఈ మేరకు వీ ధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధి లో గుర్తింపు కార్డులు అందజేస్తారు. దుకాణా లు కేటాయించిన అనంతరం వారితో పట్టణ వ్యాపారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ చైర్మన్‌గా మున్సిపాలిటీ కమిషనర్ ఉంటారు.
మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులతో పొదుపు సంఘాల ఏర్పాటు
బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశం కల్పించనున్న మెప్మా

మారనున్న వీధి రాత