‘భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం’ | - | Sakshi
Sakshi News home page

‘భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం’

Jul 13 2025 7:40 AM | Updated on Jul 13 2025 7:40 AM

‘భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం’

‘భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం’

కామారెడ్డి అర్బన్‌: భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం ఉందని హైకోర్టు న్యాయవాది విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐఎంఏ భవనంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో గురుపూజోత్స వం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాల్సి న బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీనటరాజ పూజ నిర్వహించి స్థానిక కూచిపూడి కళాక్షేత్రం కళాకారులతో నృత్యోత్సవం నిర్వహించారు. నాట్య గురువు వంశీ ప్రతాప్‌గౌడ్‌, శాసీ్త్రయ సంగీత కళాకారిణి సు హాసిని, జానపద కళాకారుడు రెడ్డి రాజయ్యలను సన్మానించారు. ముగ్గురు కళాకారుల కు సంబంధించిన శిష్యులు ప్రదర్శనలు ఇ చ్చారు. సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సమ్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాతూరి సత్యప్రసాద్‌, ప్రతినిధులు డాక్టర్‌ ఎన్‌.రాజు, సాయిబాబా, స్వామిగౌడ్‌, బసంత్‌రాజు, ప్రశాంతి, శర్వాణి తదితరులు పాల్గొన్నారు.

14, 15 తేదీల్లో డీసెట్‌

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

కామారెడ్డి అర్బన్‌ : డీఈఈ సెట్‌లో ఉత్తీర్ణులై గతంలో సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొననివా రు ఈనెల 14, 15 తేదీల్లో నిజామాబాద్‌ డై ట్‌ కళాశాలలో నిర్వహించే ధ్రువపత్రాల పరి శీలనలో పాల్గొనాలని కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీ నివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకుని సీటు పొందని వారు, సీటు పొంది కళాశాలలో చే రని వారు ఈనెల 16న వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని సూచించారు. 19న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 63039 63931 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

‘బీసీ డిక్లరేషన్‌ అమలేది’

కామారెడ్డి టౌన్‌: ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలేది అని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాలలో చట్టబద్ధత కల్పించినా రిజర్వేషన్లు అమలు కాని విషయాన్ని గుర్తు చేశారు. బీసీల మీద కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే డిక్లరేషన్‌లోని ఇతర అంశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 18 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో స్పష్టం చేయాలన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్వర్‌రావు, కపిల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపు కామారెడ్డిలో

అప్రెంటిస్‌షిప్‌ మేళా

బిచ్కుంద: ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసినవారికి అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ మేళా(పీఎంఎన్‌ఏఎం) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం కామారెడ్డిలోని శ్రావణి ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేళాలో ఎల్‌అండ్‌టీ, ఐటీసీ ఫుడ్‌ డివిజన్‌, వరుణ్‌ మోటార్స్‌, మహీంద్రా మోటార్స్‌ ప్రతినిధులు పాల్గొననున్నారు. అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో, వివిధ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయని బిచ్కుంద ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో చాలా మంది యువకులు ఐటీఐ, డిప్లొమా చేసి అప్రంటిస్‌షిప్‌ చేయడం లేదని, దీంతో వారికి ఉద్యోగావకాశాలు తక్కువగా లభిస్తున్నాయని పేర్కొన్నారు. యువత బంగారు భవిష్యత్తు కోసం కేంద్రం స్కిల్‌ ఇండియా మిషన్‌ ద్వారా అప్రెంటిస్‌షిప్‌ ఇప్పిస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు అన్ని సర్టిఫికెట్లతో మేళాకు రావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement