
గుట్టపై వెలిసిన మైసమ్మ...
దోమకొండ మండలం అంబారీపేట గ్రామ శివార్లలో బండరాళ్ల గుట్టలపై వెలసిన మైసమ్మ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చాలా కుటుంబాలు ఇంటి దేవతగా కొలుస్తాయి. పిల్లల పుట్టు వెంట్రుకలు తీసి పెద్ద ఎత్తున పండుగలు చేస్తారు. మైసమ్మకు మొక్కితే కోరికలు తీరుతాయని నమ్మిన వాళ్లు.. కోరిక నెరవేరగానే పెద్ద పండుగ చేస్తారు. ఆలయానికి సమీపంలో చెట్ల కింద, షెడ్ల కింద వంటలు చేసుకుంటారు. ఒక్కోసారి ఆదివారం పూట వేలాది మందితో ఆ ప్రాంతం కిటకిటలాడుతుంది. ఏడెనిమిదేళ్లుగా ఆషాఢంలో బోనాలు సమర్పిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి బోనం వెళుతోంది.

గుట్టపై వెలిసిన మైసమ్మ...