
డెంగీకి వ్యాక్సిన్ లేదు.. నివారణ ఒక్కటే మార్గం
బాన్సువాడ రూరల్: వర్షాకాలంలో సాధారణంగా విజృంభించే డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులో లేద ని, నివారణ ఒక్కటే మార్గమని బాన్సువాడ సబ్ క లెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా మండల పరిషత్ కార్యా లయంలో గురువారం డివిజన్‌లోని ఆయాశాఖల మండల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని, నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌బాల్స్ వే యాలని సూచించారు. డ్రెనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ, చెత్తసేకరణ సమర్థవంతంగా అ మలు చేయాలన్నారు. తాగునీటి ట్యాంకులు శు భ్రం చేయిస్తూ బ్లీచింగ్ పౌడర్‌తో క్లోరినేషన్ చేయాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చే యించాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ ని ర్వహించా లని అధికారులకు సూచించారు. అనంత రం డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పురోగతిపై డివిజన్‌లోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. డి ప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విద్య, డీఎల్‌పీవో సత్యనారాయణరెడ్డి, ఆయా మండలాల వైద్యాధికారు లు, ఎంపీడీవోలు, ఎంఈవో, ఎంపీవోలు పాల్గొన్నారు.

డెంగీకి వ్యాక్సిన్ లేదు.. నివారణ ఒక్కటే మార్గం