
ఆర్మూర్‌లో జూనియర్ కళాశాల సీజ్
ఆర్మూర్: నిబంధనలకు విరుద్ధంగా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న ఓ భవనంలో కొనసాగుతున్న క్షత్రియ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో) రవికుమార్ గురువారం సీజ్ చేశారు. విద్యార్థులను ఇళ్లకు పంపించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ భవనంలో కళాశాలను నిర్వహణకు మూడేళ్ల క్రితం ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులను నిరాకరించింది. దీంతో క్షత్రియ జూనియర్ కళాశాల యాజమాన్యం ఆర్మూర్ మండలం చేపూర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో కళాశాల నిర్వహణకు అనుమతులు తీ సుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న భవనంలోనే తరగతులను ని ర్వహిస్తూ వస్తున్నారు. సుమారు 500 మంది బాలబా లికలు ఇదే భవనంలోని పై అంతస్తుల్లో హాస్టల్‌లో ఉంటుండగా, మరో 300 మంది విద్యార్థులు డే స్కాలర్స్‌గా చదువుకుంటున్నారు. మరో ప్రైవేట్ కళా శాల యజమాని క్షత్రియ జూనియర్ కళాశాలపై అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించి నిబంధనల ను అతిక్రమించిన తీరును వివరించారు. స్పందించిన అధికారులు కళాశాలను సందర్శించి సీజ్ చేసి దిద్దుబా టు చర్యలు చేపట్టారు. అడ్మిషన్ తీసుకున్న సుమారు 800 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురవుతున్నారు. మూడేళ్లకు పైగా నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నా తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించిన అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
అనుమతులు ఒకచోట..
నిర్వహణ మరోచోట
అయోమయంలో 800 మంది
విద్యార్థులు