బల్దియాలో కలపొద్దు
బిచ్కుంద : ‘మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీ నం చేసి మా పొట్టగొట్టొదు’ అంటూ గోపన్‌పల్లి వా సులు ఆందోళనకు దిగారు. మంగళవారం బిచ్కుంద మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళ న చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు అందరూ పంచాయతీగానే కొనసాగించాలని చెప్పార న్నారు. తమ అభిప్రాయాలను పక్కనబెట్టి మున్సి పాలిటీలో విలీనం చేయడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. కూలి పనులు చేసుకుని జీవించే తమకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేయవద్దని కోరారు. అధికారులు స్పందించి తమ గ్రామాన్ని పంచాయతీగానే కొనసాగించాలన్నారు. అనంత రం అధికారులకు వినతి పత్రం అందించారు.
గోపన్‌పల్లివాసుల డిమాండ్
మున్సిపల్ కార్యాలయం ముట్టడి


