రూ.20తో రెండు లక్షల ప్రమాద బీమా
మీకు తెలుసా?
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) కింద ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా కలిగిన 18–70 ఏళ్ల లోపు వయస్సగల వారు అర్హులు. ఈబీమా ద్వారా ప్రమాదం వలన మరణం సంభవించినా, లేదా ప్రమాద కారణంగా రెండు కళ్లు, రెండు చేతులు, లేదా ఒక కంటి చూపు, చెయ్యి లేదా పాదం కోల్పోయిన రూ. రెండు లక్షల బీమా నామినీకి సొమ్ము చెల్లిస్తారు.
● ఒక కన్ను లేదా ఒక చెయ్యి, లేదా ఒక కాలు వీటిలో ఏదేని ఒకటి కోల్పోయిన రూ.లక్ష చెల్లిస్తారు.
● ప్రమాదం జరిగినట్టుగా పోలీసు ఎఫ్‌ఐఆర్, డాక్టర్ ధ్రువీకరణతో సులభంగానే సంబంధిత బ్యాంకు ద్వారా క్‌లైమ్ చేసి బీమా సోమ్ము పొందవచ్చు.
– కామారెడ్డి అర్బన్


