అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం
మీకు తెలుసా?
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.204 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేయించారు.●
● 2008 మార్చి 18న వైఎస్సార్ స్వహస్తాలతో అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసి ప్రారంభించారు.
● ఆర్మూర్ ప్రాంత బీసీ నాయకుడు, మాజీ మంత్రి అర్గుల్ రాజారాంకు ఇచ్చిన అరుదైన గౌరవం ఇది.
● ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని మాక్లూర్, నందిపేట్, ఆర్మూర్, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాల్లోని 53 గ్రామాల్లో 38 వేల 792 ఎకరాల ఆయకట్టు స్థీరీకరణ అయింది.
● నందిపేట మండలం ఉమ్మెడ శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోని గోదావరి నదీ జలాలు 22.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుత్ప చెరువు మీదుగా ఆర్మూర్ ప్రాంత వ్యవసాయ భూములకు అందుతుండటంతో రైతులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. – ఆర్మూర్


