
ఎస్‌ఈ చొరవతో విద్యుత్ లైన్లకు మరమ్మతులు
బీబీపేట: మండలంలోని ఇస్సానగర్ గ్రామంలో గతేడాది నుంచి వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్లు కిందకి ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ సోమవారం గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో అక్కడున్న రైతులు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన 10 ఇంటర్ పోల్స్ వెంటనే వేయాలని సిబ్బందికి సూచించారు. మంగళవారం ఇంటర్ పోల్స్‌ను సిబ్బంది మరమ్మతులు చేసి అమర్చారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఈఈ కల్యాణ్ చక్రవర్తి, ఏడీఈ సుదర్శన్ రెడ్డి, ఏఈ విజయభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.