
విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ శివారులోని పంట పొలాల్లో విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. పట్టణ కేంద్రానికి చెందిన రైతు రాజేశ్ తనకున్న రెండు గేదెలను తీసుకొని శివారు ప్రాంతానికి మేత కోసం తీసుకెళ్లాడు. అక్కడ మేత మేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగి పడి రెండు గేదెలపై పడ్డాయి. ఈ ఘటనలో అవి మృతి చెంది. పక్కనే ఉన్న మరో 20 గేదెలు, పశువలకు పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ ఏడీఈ కృష్ణ చైతన్య, మండల పశువైద్యాధికారి రవికిరణ్, రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.