
ఉద్యాన పంటలసాగును ప్రోత్సహించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో మహిళలను ఉద్యానపంటలసాగుకు ప్రోత్సహించాలని డీఆర్‌డీవో సురేందర్ సూచించారు. మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉద్యానపంటల సాగుతో మహిళలు ఆర్థికంగా స్థిరపడతారని ఆయన చెప్పారు. ఉద్యానపంటలను సాగుచేసిన రైతులకు ఉపాధిహామీ పథకం ద్వారా నిర్వాహణ ఖర్చులు చెల్లిస్తామన్నారు. మునగపంటను సాగు చేసే రైతులకు గుంతలు తీసేందుకు, నీళ్లు పట్టేందుకుగానూ ఉపాధిహామీ ద్వారా డబ్బులు వస్తాయని ఆయన చెప్పారు. కాగా నాగిరెడ్డిపేట మండలంలో బ్యాంకులింకేజీ ద్వారా 683సంఘాలకు రూ.36కోట్ల80లక్షలు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. లక్ష్యం నెరవేర్చేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఆయన చెప్పారు. దీంతోపాటు సీ్త్రనిధి రుణాల రికవరీని వందశాతం చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు బేస్త శాంత, సీ్త్రనిధి మేనేజర్ కిరణ్, ఏపీయం జగదీశ కుమార్, సీసీలు నారాయణ, దత్తు, రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, రషీద్, సుజాత, అకౌటెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.