
బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
ఖలీల్‌వాడి: యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీసీపీ శ్రీనివాస్‌రావు సూచించారు. నగరంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో మంగళవారం గంజాయికి అలవాటు పడిన యువకులతో పాటు వారి తల్లితండ్రులకు టాస్క్‌ఫోర్స్ సీఐ ఆర్ అంజయ్య, టాస్క్ ఫోర్స్ ఎస్సై గోవింద్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. అందమైన జీవితాన్ని మత్తుకు బానిస కాకుండా చూసుకోవాలని యువకులకు సూచించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా మత్తు పదార్థాలు సరఫరా చేసినా, గంజాయి పెంచినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా గంజాయి రవాణా చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.