
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణి ద్వారా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 96 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. త్వరితగతిన తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించడం గాని, పరిష్కార మార్గాలు చూపడం గాని చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. తీసుకున్న చర్యలపై దరఖాస్తుదారుడికి రాతపూర్వకంగా సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణికి 96 ఫిర్యాదులు