
జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానీపేట గ్రామ శివారులోని పంట చేనులో బండరాళ్ల కోసం అమర్చిన జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. భవానీపేట గ్రామానికి చెందిన దర్శనం సిద్ధిరాములు పంట చేనులో ఉన్న బండరాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ అమర్చినట్లు సమాచారం అందడంతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ రవీందర్, ఎస్సైలు వెంకట్రావు, రాఘవేంద్ర గ్రామానికి చేరుకొని పరిశీలించారు. డాక్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయగా 31 జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సిద్ధిరాములు భూమిని బాగు చేసుకునేందుకు జిలెటిన్ స్టిక్స్ అమర్చినట్లు తెలిపారు. కాగా, ఆదివారం జిలెటిన్ స్టిక్స్ పేల్చడంతో సబ్‌స్టేషన్‌కు ప్రమాదం తప్పిందన్నారు. పలు ఇళ్లు, వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు జిలెటిన్ స్టిక్స్ అమర్చిన వ్యక్తిని, పంట చేను యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
గుర్తు తెలియని మహిళ మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని గాజుల్‌పేట్ గురుద్వారా సమీపంలో స్పృహ తప్పిన గుర్తు తెలియని మహిళ (60 నుంచి 65) ఆస్పత్రిలో మృతి చెందినట్లు రెండో టౌన్ ఎస్సై తెలిపారు. వివరాలు తెలిస్తే 87126 59838 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.