
స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరి
కామారెడ్డి క్రైం: పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సోమవారం స్కూల్ బస్సుల డ్రైవర్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురి కాకుండా డ్రైవర్లు, యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు దాటే క్రమంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. బస్సులకు మరమ్మతులు ఏవైనా ఉంటే ముందుగానే చేయించుకుని ఫిట్‌నెస్ ధ్రువీకరణ చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం బస్సులు నడపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.