కేసుల విచారణలో నాణ్యత ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

కేసుల విచారణలో నాణ్యత ముఖ్యం

May 20 2025 1:06 AM | Updated on May 20 2025 1:06 AM

కేసుల

కేసుల విచారణలో నాణ్యత ముఖ్యం

కామారెడ్డి క్రైం: నాణ్యతతో కూడిన కేసుల విచారణ చేపట్టాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూ చించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సో మవారం ఆయా పోలీస్‌ స్టేషన్ల రైటర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేసుల దర్యాప్తు, విచారణ, పరిశోధనలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. ముఖ్యంగా సీసీటీఎన్‌ఎస్‌లో కేసులకు సంబంధించిన సమాచా రం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ అయ్యేలా చూడాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నుంచి చార్జిషీట్‌ వరకు అన్ని వివరాలు సమగ్రంగా, స్పష్టంగా నమోదు చేయాలని, ఒక్క అంశంలో కూడా తప్పులు దొర్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి రైటర్‌కు ఉందని తెలిపారు. బాధితుడికి న్యాయం జరిగేలా విచారణ సాగాలన్నారు. సమావేశంలో డీసీఆర్‌బీ సీఐ మురళి తదితరులు పాల్గొన్నారు.

పోలీసు శాఖకు

మంచి పేరు తేవాలి

కామారెడ్డి క్రైం : నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. రెండు నెలల క్రితం మృతి చెందిన ఇద్దరు పోలీసుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను సోమ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వడ్ల రవి భార్య సౌఖ్య, అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ కూతురు మానసలకు జూనియర్‌ అసిస్టెంట్‌లుగా ఉద్యోగ పత్రాల ను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, కార్యాలయ ఏవో అప్సర్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్బరీ మొక్కల పరిశీలన

బీబీపేట : యాడారంలో పట్టు పురుగుల సా గు కోసం పెంచుతున్న మల్బరీ మొక్కలను సోమవారం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ పరిశ్రమతో తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి ఆశించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల రైతులు సంప్రదించాలని సూచించారు. ఆమె వెంట డివిజన్‌ ఉద్యాన అధికారి సంతోషి రాణి, జిల్లా పరిశ్రమల అధికారి అయిలయ్య తదితరులు ఉన్నారు.

డిగ్రీ పరీక్షలకు

508 మంది గైర్హాజరు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం మూడో రోజు ప్రశాంతంగా జరిగినట్లు ఆడి ట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖ ర్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 32 పరీక్ష కేంద్రాల్లో 7,680 మంది విద్యార్థులకు 7,172 మంది హాజరు కాగా 508 మంది గై ర్హాజరైనట్లు వెల్లడించారు. ఉదయం జరిగిన 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు 7,112 మంది విద్యార్థులకు 6,670 మంది హాజరు కాగా 442 మంది గైర్హాజరయ్యారని తెలిపా రు. మధ్యాహ్నం జరిగిన 1వ సెమిస్టర్‌ బ్యా క్‌లాగ్‌ పరీక్షలకు 558 మంది విద్యార్థులకు 502 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

సేంద్రియ వ్యవసాయంపై

నైపుణ్య శిక్షణ

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో గ్రా మీణ యువ రైతులకు సేంద్రియ వ్యవసా యంపై నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు బ్లాక్‌ టెక్నాలజీ మేనేజర్‌ భరత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి జూన్‌ 1వరకు శిక్షణ ఇస్తామని.. వారం రోజుల పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు 23లోగా ఆత్మ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

కేసుల విచారణలో నాణ్యత ముఖ్యం 
1
1/2

కేసుల విచారణలో నాణ్యత ముఖ్యం

కేసుల విచారణలో నాణ్యత ముఖ్యం 
2
2/2

కేసుల విచారణలో నాణ్యత ముఖ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement