
వరికొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు
ఎల్లారెడ్డి రూరల్: వరి పంటలను హార్వెస్టర్ మిషన్ల ద్వారా కోత కోసిన అనంతరం రైతులు వరికొయ్యలకు నిప్పు పెడితే భూసారానికి ముప్పు జరిగే ప్రమాదం ఉంది. వరికొయ్యలకు నిప్పు పెట్టడంతో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. గ్రామాలలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికి ఒకరిని చూసి మరొకరు వరికొయ్యలకు నిప్పు పెడుతున్నారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడడంతో పాటు భూమిలో సారవంతం తగ్గిపోతుందని, వానపాములు, చిన్నచిన్న సూక్ష్మజీవులు చనిపోవడంతో భూమి సారవంతం చేసే పని నిలిచిపోతుందన్నారు. వరి కొయ్యలతో పాటు, మొక్కజొన్న, జొన్న సొప్ప పొలంలో అలాగే వదిలేయాలి. నాటు వేసే వారం రోజుల ముందు పొలంలో మడులలో నీటిని నింపి ఎకరాకు రెండు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్పేట్ మందును చల్లి వారం రోజుల పాటు ఉంచాలని, దీంతో గడ్డి మురిగి పోయి భూమికి సేంద్రియ ఎరువుగా మారుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు పొలం దుక్కి దున్నే ఖర్చు సైతం మిగులుతుందన్నారు.
పంటపొల్లాలో కొయ్యలను
కాల్చేస్తే వాయుకాలుష్యం
నశిస్తున్న సూక్ష్మజీవులు,
పర్యావరణానికి హాని

వరికొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు