
నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్
నందిపేట్: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నందిపేట మండల కేంద్రంలోని రాజానగర్ దుబ్బ, ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. సుమారు 102 మంది పోలీసు అధికారులు, సిబ్బంది 210 ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 52 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు కమ్యూనల్ రౌడీలను, నలుగురు అనుమానిత వ్యక్తులను చెక్ చేసినటులతెలిపారు. నంబర్ ప్లేట్ లేని, మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించిన 12 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో ఆర్మూర్ టౌన్ సీఐ సత్యనారాయణ, భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై చిరంజీవి, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 9 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి

నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్