
బ్యాంకు కేసులు రాజీ కుదర్చాలి
కామారెడ్డి టౌన్: జూన్ 14వ తేదీన జిల్లా కోర్టులో జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో సమన్యాయంతో బ్యాంక్ కేసులు రాజీ కుదర్చాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి. నాగరాణి బ్యాంక్, చిట్‌ఫండ్ మేనేజర్లకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బ్యాంక్, చిట్‌ఫండ్ మేనేజర్‌లతో సమావేశం నిర్వహించారు. బ్యాంకు కేసులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రిలిటిగేషన్ కేసులుగా కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బ్యాంకు అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు వీలైనన్ని కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు. కక్షి దారులు జూన్ 14 న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చంద్రసేన్‌రెడ్డి, మేనేజర్లు పాల్గొన్నారు.
లోక్ అదాలత్ సద్వినియోగం
చేసుకోవాలి
జిల్లా న్యాయమూర్తి నాగరాణి