
ఆటలతో సమ్మర్ సందడి
రామారెడ్డి : విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడా ప్రాఽథికార సంస్థ, జిల్లా యువజ న క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి వేసవి క్రీడా శిబిరాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించింది. వాటి పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 14 ఏళ్లలోపు బాల బాలికలు ఉదయం, సాయంత్రం వేళలో శిక్షకుల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈశిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10 వేసవి సమ్మర్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, కోకో, టెన్నిస్ తదితర క్రీడలకు సంబంధించి శిక్షకులు ఉద యం సాయంత్రం పూట శిక్షణనిస్తున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, శారీరక ధృడత్వం పెంచుకోవడానికి ఈశిబిరాలు దోహదపడుతున్నాయి.
క్రీడాశిబిరాలతో నైపుణ్యం పెరుగుదల
జిల్లా వ్యాప్తంగా 10 సమ్మర్
క్యాంప్‌ల ఏర్పాటు
మెలకువలు నేర్పిస్తున్నాం
రామారెడ్డిలో ఫుట్‌బాల్ సమ్మర్ క్యాంప్ క్రీడల్లో బాలబాలికలకు క్రీడల్లో మెలకువలు నేర్పిస్తున్నాం. భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడుతుంది. –బాల్‌రాజు, సమ్మర్ క్యాంప్ శిక్షకుడు, రామారెడ్డి