
రేషన్ కార్డ్ స్టేటస్ ఏమిటో?
రామారెడ్డి: కొత్త రేషన్ కార్డుల కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి ప్రజలు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు.జిల్లా వ్యాప్తంగా 60వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శులకు మొబైల్ యాప్‌ను అందజేశారు. రెండు నెలల క్రితం దరఖాస్తులు పరిశీలించిన కార్యదర్శులు వాటిని ఉన్నతాధికారులకు పంపించారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులు జారీ కావడం లేదు. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కావడం లేదు. దీంతో దరఖాస్తుదారులు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు..
కుటుంబ సభ్యుల పేర్లు, నమోదు కార్డుల విభజన కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డులు జారీ అయ్యాయి. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అవుతున్నాయి. దరఖాస్తు ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందో తెలుసుకునే వీలుంది. మీసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు చాల వరకు పరిష్కారించారు. కొంత మందికి కొత్త కార్డులు వచ్చాయి. ఐదు సంవత్సరాల పిల్లల పేర్లను రేషన్ కార్డులో నమోదు చేయడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
మళ్లీ వేచి చూడడమేనా...
ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల స్టేటస్ కనిపించడం లేదు. మీ సేవా కేంద్రాల ద్వారా మళ్లీ దరఖా స్తు చేసుకుంటే నెలరోజుల్లో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ సేవా కేంద్రాల్లో ద రఖాస్తు చేసుకుంటే దరఖాస్తులు పరిష్కారం అవుతు న్నాయి. దరఖాస్తు స్టేటస్ ఏమిటో చూసుకోవచ్చు. రేషన్ కార్డ్ రాకపోతే మీసేవా కేంద్రంలో దరఖాస్తులు చేసుకుంటే ఎక్కడ పెండింగ్ ఉందో స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే https:// epds. telangana. gov. in/ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డును ఎంటర్ చేసి ఎక్కడో పెండింగ్ ఉందో తెలుసుకోవచ్చు.
తహసీల్, ఎంపీడీవో ఆఫీస్‌ల చుట్టూ చక్కర్లు
కొడుతున్న ప్రజలు
జారీకాని రేషన్ కార్డులు
స్టేటస్ తెలుసుకోవచ్చు
మీసేవా కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి, సభ్యుల కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకున్నా పెండింగ్‌లో ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
– రమేశ్‌రెడ్డి, మీసేవ నిర్వాహకుడు, రామారెడ్డి

రేషన్ కార్డ్ స్టేటస్ ఏమిటో?