
గంజాయి తాగిన వ్యక్తి అరెస్టు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): గంజాయి తాగిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. మండలకేంద్రంలో శనివారం ప్రొబేషనరీ ఎస్సై శైలేందర్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టగా, శ్రీరాంనగర్ తండాకు చెందిన భామన్ బహదూర్ సింగ్ బైక్‌పై వెళుతుండగా ఆపి తనిఖీ చేశారు. అతడు గంజాయి తాగినట్లు గుర్తించి, పట్టుకున్నారు. బైక్‌లో ఉన్న 45 గ్రాముల గంజాయిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు, సౌత్ రూరల్ సీఐ సురేష్‌కుమార్ అభినందించారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని తల్వేద గ్రామ సమీపంలోని గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై చిరంజీవి శనివారం తెలిపారు. మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామ సమీపంలో తనిఖీలు చేపడుతుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు కనిపించడంతో వాటిని పట్టుకుని పో లీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. ఇసుక ట్రాక్టర్ల డైవర్లపై కేసు నమెదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నాడు.
నకిలీ డాక్టర్‌పై కేసు నమోదు
ఖలీల్‌వాడి: నగరంలోని బోధన్ రోడ్డులో ఫస్ట్‌ఎయిడ్ సెంటర్ నడిపిస్తున్న నకిలీ డాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి శనివారం తెలిపారు. మేకల రాకేష్ అనే వ్యక్తి విజిలెన్స్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు ఇటీవల ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వాహకుడు ఎలాంటి డాక్టర్ పట్టా లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.