
ఈసారైనా స్పందించేనా?
ఎల్‌ఆర్‌ఎస్–2020 స్కీం కింద ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇచ్చినా దరఖాస్తుదారులు స్పందించడం లేదు. ఇప్పటికే మూడుసార్లు గడువు ఇచ్చినా 30 శాతం కూడా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించలేదు. దీంతో
అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించడంతోపాటు నిబంధనల్లోనూ మార్పులు చేసింది. గిఫ్ట్, వారసత్వ డీడ్‌ల ద్వారా జరిగే లావాదేవీలను కూడా పరిశీలనలోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది.
కామారెడ్డి టౌన్ : అనధికార ప్లాట్లు, అక్రమ వెంచర్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్–2020 పేరిట దాదాపు ఐదేళ్ల క్రితం దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఆ ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోయింది. ప్రభుత్వం ఇటీవల దానిని పట్టాలెక్కిస్తూ 25 శాతం రాయితీతో ఫిబ్రవరిలో వన్‌టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది. దీనికి మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే దరఖాస్తుదారుల నుంచి స్పందన రాకపోవడంతో ఏప్రిల్ 30 వరకు గడువును పొడిగించింది. ఆ తర్వాత ఈనెల 3వ తేదీ వరకు అవకాశమిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ వేగవంతం కోసం జోరుగా ప్రచారం చేస్తున్నా, కలెక్టరేట్, బల్దియా కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినా అంతగా స్పందన రాలేదు. దీంతో ఇటీవల నాలుగోసారి ఎల్‌ఆర్‌ఎస్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు అవకాశం ఇచ్చింది.
ఫీజు చెల్లించింది 5,166 మందే..
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 20,500 వచ్చాయి. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌కు 5,166 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. అంటే 30 శాతం కూడా దరఖాస్తుదారులు స్పందించలేరు. ఇందులో 1,755 మంది దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. దరఖాస్తుదారుల ప్లాట్లను క్రమబద్ధీకరిస్తూ ప్రొసిడింగ్ పత్రాలను అందజేశారు. ఈనెల 3వ తేదీవరకు మూడు మున్సిపాలిటీలకు రూ. 12.16 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. నాలుగోసారి గడువు పెంచడంతో మరికొంతమంది స్పందించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
కాగా బల్దియాలలో టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు, సిబ్బంది పోస్టుల ఖాళీలతో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సాధ్యం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కామారెడ్డి బల్దియాలో రెండు టీపీవో పోస్టులకు ఒకరు మాత్రమే ఉన్నారు. అలాగే నాలుగు టీపీఎస్ పోస్టులుండగా ఒక్కరు, నాలుగు టీపీబీఎస్ పోస్టులకు ఒక్కరు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో దరఖాస్తులను పరిష్కరించడంలో ఆలస్యం అవుతుండడంతో దరఖాస్తుదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఎల్‌ఆర్‌ఎస్ పథకం గడువు ను ఈనెలాఖరు వరకు పొడగిస్తూ జీవో జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్రమ లేఅవుట్ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. లేకపోతే గడువు ముగిసిన తర్వా త భవన నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు పడా ల్సి ఉంటుంది.
– రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి
మూడు విడతల్లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు వివరాలు..
వారసత్వానికి సెల్ డీడ్ లేకున్నా..
దరఖాస్తుదారుల ప్రధాన సమస్యకు మున్సిప ల్ శాఖ తాజాగా పరిష్కారం చూపింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు తప్పనిసరిగా సెల్‌డీడ్‌ను జ తపరిస్తేనే సంబంధిత ప్లాటు లేదా లే అవుట్ క్ర మబద్ధీకరణకు అవకాశం ఉండేది. ఇప్పుడు ని బంధనల్లో సవరణలు చేశారు. రిజిస్టర్డ్ గిఫ్ట్ డీ డ్, ఎక్స్ఛేంజ్ డీడ్ లేదా వారసత్వ హక్కుతో స్థ లాన్ని పొందిన వారు కూడా ఇప్పుడు క్రమబద్ధీ కరణకు అర్హులని సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో నాలుగో విడత గడువులో దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపుపై అనాసక్తి
మూడు విడతల్లో స్పందించింది
30 శాతం దరఖాస్తుదారులే..
నాలుగోసారి గడువు పొడిగించిన సర్కారు
క్రమబద్ధీకరణ నిబంధనల్లో మార్పులు
గిఫ్ట్, వారసత్వ డీడ్‌ల ద్వారా
రెగ్యులరైజేషన్‌కు అనుమతి

ఈసారైనా స్పందించేనా?