లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించాలి

May 19 2025 2:13 AM | Updated on May 19 2025 2:13 AM

లోక్‌

లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించాలి

కామారెడ్డి టౌన్‌ : వచ్చేనెల 14న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ సూచించారు. శనివారం జిల్లా కోర్టులో పోలీస్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి పోలీస్‌ శాఖ మరింతగా కృషి చేయాలని సూచించారు. కక్షిదారులు జాతీయ లాక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని రాజీయే రాజమార్గంగా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, ఎస్పీ రాజేశ్‌ చంద్ర, పీపీలు రాజ్‌గోపాల్‌ గౌడ్‌, సూర్యప్రసాద్‌, అశోక్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

ప్రజలతో ఫ్రెండ్లీగా మెలగాలి

కామారెడ్డి క్రైం: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజల తో ఫ్రెండ్లీగా మెలగాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. శనివారం ఆమె కామారెడ్డి ప ట్టణ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులను, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డ యల్‌ 100 కు వచ్చే ఫోన్‌ కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు. ప్రజల సమస్యల పరి ష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నా రు. కేసులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

‘వాహనాలను తీసుకెళ్లకుంటే

వేలం వేస్తాం’

కామారెడ్డి క్రైం : కేసుల్లో పట్టుబడిన, వివిధ ప్రాంతాల్లో లభించిన వాహనాలను వాటి యజమానులు తీసుకువెళ్లాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. ఆరు నెలల్లోగా తీసుకువెళ్లని పక్షంలో వేలం వేస్తామని పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో 211 బైక్‌లు, 3 ఆటోలు, 3 కార్లు ఉన్నాయని, వాటి వివరాలు జిల్లా పోలీసు శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. వాహనాల యజమానులు ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయానికి వచ్చి పోలీసు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి నవీన్‌ కుమార్‌ను సంప్రదించాలని సూచించారు.

బడిబాటను

వాయిదా వేయాలి

కామారెడ్డి టౌన్‌: బడిబాట కార్యక్రమాన్ని వచ్చేనెల 6వ తేదీన ప్రారంభించకుండా 9వ తేదీకి వాయిదా వేయాలని తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌, ప్రధాన కార్యదర్శి కాంబ్లె గోపాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. జూన్‌ 7 తేదీన బక్రీద్‌ను దృష్టిలో ఉంచుకొని బడిబాటను వేయాలని విజ్ఞప్తి చేశారు.

భిక్కనూరు సొసైటీ కార్యదర్శిపై వేటు

భిక్కనూరు : ధాన్యం తూకం వేయనందున మనస్తాపంతో ఇద్దరు రైతులు తమ వడ్లకు నిప్పు పెట్టడానికి యత్నించిన విషయంలో సహకార శాఖ అధికారులు పలువురిపై చర్యలు తీసుకున్నారు. భిక్కనూరు సింగిల్‌విండో కార్యదర్శి నర్సింలును సస్పెండ్‌ చేస్తూ డీసీవో రామ్మోహన్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రం పర్యవేక్షణలో విఫలమైనందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు గంగారాంను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రికార్డులను సరిగా నిర్వహించకపోవడం, వడ్లు తీసుకవచ్చిన రైతులు వివరాలను సీరియల్‌ రిజిస్టర్‌లో రాయకపోవడం, టోకెన్లను ఇవ్వకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. కేంద్రాన్ని పర్యవేక్షించడంలో విఫలమైనందున కొనుగోలు కేంద్రం సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ రమేశ్‌కు సంజాయిషీ నోటీసు ఇచ్చారు.

లోక్‌ అదాలత్‌లో ఎక్కువ  కేసులను పరిష్కరించాలి 
1
1/1

లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement